హోమ్ » పాల్గొనండి
ధరఖాస్తు చేయుటకు సాధారణ మార్గదర్శకాలు
నామినేషన్ ఫారం పూరించేందుకు సూచనలు:
అన్ని కేటగిరీలకు నామినేషన్లు పంపవచ్చు. ఒకే కేటగిరీకి ఒకటి కంటే ఎక్కువ  నామినేషన్లు కూడా పంపవచ్చు.
Apply Online for 2023
Download Nomination Form 2023


నామినేషన్ ఫారం పూరించేందుకు తెలుగు, ఇంగ్లిష్ భాషలు మాత్రమే ఉపయోగించవలెను.
స్వీయ నామినేషన్లు అంగీకరించబడవు. థర్డ్ వ్యక్తులు/సంస్థలచే పంపబడు నామినేషన్లు మాత్రమే అంగీకరించబడును.
గత సంవత్సరం అవార్డు పొందిన విజేతలు మళ్లీ ఈ సంవత్సరం అవార్డుల కొరకు దరఖాస్తు చేయరాదు.
సంస్థలు కాక, అవార్డుల కొరకు విడిగా దరఖాస్తు చేసుకొను వ్యక్తులు.. ‘ఇండివిడ్యుయల్’ గా మార్క్ చేయబడిన కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు చేసుకొను వ్యక్తులు/ సంస్థలు సమైక్య ఆంధ్రప్రదేశ్ (2-6-2014వ తేదీకి ముందున్నట్టి) రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రంలో సేవ చేయుటకు ఆసక్తి లేదా చొరవ కలిగియుండవలెను.
అన్ని సెక్షన్లూ పూరించిన ఫారమ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి. అసంపూర్తిగా ఉన్న ఫారమ్లు పరిగణలోకి తీసుకొనబడవని గ్రహించగలరు. ఒకవేళ ఫారంలోని అంశాలలో ఏదైనా మీకు వర్తించని ఎడల లేదా ఏదైనా అంశానికి సమాధానం ఇవ్వనవసరం లేదని మీరు భావించిన ఎడల, దయచేసి అక్కడ.. ‘వర్తించదు’ అని పేర్కొనగలరు.
ప్రతి నామినేషన్లో నామినేటర్ సంతకంతో కూడిన స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి.
నామినేటర్, 1 ఫైలు వరకు, తమ చర్య లేదా చొరవ/ కొత్త అంశం యొక్క ప్రభావాన్ని తెలియజెప్పే ఆధారాలను సమర్పించవచ్చు.
ఏప్రిల్,  30, 2024 వ తేదీ సాయంత్రం 6 గం.ల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించబడును.
ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనుటకు అవసరమైన మరిన్ని సూచనల కొరకు www.sakshiexcellenceawards.com వెబ్సైట్లో పేర్కొనబడిన నియమ నిబంధనలు చూడగలరు.
ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం అంటే, వారు సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించినట్లుగానే పరిగణించబడును.
ప్రతి కేటగిరీలోనూ అవార్డు విజేతను జ్యూరీ ఎంపిక చేస్తుంది. ఈ విషయంలో జ్యూరీదే తుది నిర్ణయం. దరఖాస్తుదారులందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండవలెనని గ్రహించగలరు.
ఈ ఫారంలో పేర్కొనబడిన సమాచారమంతయూ గోప్యంగా ఉంచబడును. ఈ సమాచారం.. అవార్డుకు ఎంట్రీ ఎంతవరకు అర్హతమైనదన్న అంశాన్ని పరిశీలించుటకు మాత్రమే ఉపయోగించబడును.

సంతకం చేసిన మూడు నామినేషన్ల కాపీలను, సంబంధిత డాక్యుమెంట్లు ఏవైనా ఉన్న ఎడల వాటితో కలిపి 30th
 
ఏప్రిల్, 
2024
 సాయంత్రం 6 గంటలలోపు అందజేయవలెను

పూర్తిగా పూరించబడిన నామినేషన్లను పోస్ట్ లేదా కొరియర్ల ద్వారా, లేదా స్వయంగా అందజేయవలెను.

సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్

సాక్షి టవర్స్ , 6-3-249, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్
హైదరాబాద్, 500034
ఫోన్ 040 - 040 2325 6134
ఈమెఇల్ sakshiexcellenceawards@sakshi.com
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.