హోమ్ » తరచూ అడిగే ప్రశ్నలు
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ఉద్దేశమేమిటి?

ఏపీ/తెలంగాణ ప్రాంతంలో స్వచ్ఛంద సేవ, విద్య, వ్యవసాయం, క్రీడలు, వినోదం, సామాజిక రంగాల్లో సమాజానికి సేవ చేయడంతో పాటు తమదైన ప్రభావం చూపిన వ్యక్తులను/ సంస్థలను గుర్తించడం ఈ అవార్డు లక్ష్యం.

సాక్షి ఎక్సలెన్స్ అవార్డులకు ఎవరెవరిని నామినేట్ చేయవచ్చు?
ఎంచుకున్న విభాగాన్ని బట్టి, అవార్డు విభాగం గుర్తించిన ఏ విభాగంలోనైనా సంబంధిత క్షేత్రంలో పని చేస్తున్న వ్యక్తిని/సంస్థను అవార్డు కోసం నామినేట్ చేయవచ్చు.
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో ఉన్న అవార్డు విభాగాలేమిటి?
ఈ అవార్డు విభాగాలను రెండు బ్రాకెట్లుగా వర్గీకరించారు - మెయిన్ అవార్డ్స్, యంగ్ అచీవర్. బ్రాకెట్లవారీ వర్గీకరణ ఇలా ఉంది:

మెయిన్ అవార్డ్స్ 
లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్
తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ 
తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ 
ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ - వ్యక్తి/ సంస్థ
ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్
ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్‌ డెవలప్ మెంట్ 
బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ - లార్జ్ స్కేల్
బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ - స్మాల్ / మీడియం
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ ఇండివిడ్యువల్
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ కార్పొరేట్
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ ఎన్‌జీఓ

యంగ్ అచీవర్
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ - ఎడ్యుకేషన్ 
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ - సామాజిక సేవ
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ ఇండివిడ్యువల్
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ కార్పొరేట్
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్‌మెంట్ కన్‌జర్వేషన్ ఎన్‌జీఓ
నామినేట్ చేసిన ప్రాజెక్టులు/చర్యలను పరిగణనలోకి తీసుకునే కాలావధి ఏమిటి?
కేవలం 1st ఏప్రిల్ 2023 , 31st మార్చి 2024  మధ్యకాలంలో ప్రారంభమై కార్యకలాపాలు మొదలుపెట్టిన ప్రాజెక్టులను/చర్యలను మాత్రమే నామినేట్ చేయవచ్చు.
అవార్డుల కోసం నేనెలా నామినేట్ చేయవచ్చు?
నామినేషన్ కొరకు రెండు విధానాలు అందుబాటులో ఉన్నవి
ఆన్లైన్:
ఆన్‌లైన్ సమర్పణ కోసం..  నామినేషన్ ఫారమ్‌ను 2023

 లేక
ఆఫ్లైన్: 
నామినేషన్ ఫారమ్‌ను 2023 డౌన్‌లోడ్ చేయండి, నింపి, పోస్టు ద్వారా గానీ/కొరియర్ ద్వారా గానీ/నేరుగా గానీ ఈ దిగువ చిరునామాకు సమర్పించవచ్చు:

సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500034

** ఒక కాపీ స్వీయ సంతకం మరియు ఒక సెట్ సంబంధిత డాకుమెంట్స్  సమర్పించాల్సి ఉంటుంది
ఫారాన్ని నేను ఏ ప్రాంతీయ భాషలోనైనా పూరించవచ్చా?
లేదు. నామినేషన్ ఫారాన్ని ఇంగ్లిష్/తెలుగు భాషల్లో మాత్రమే పూరించవచ్చు.
మెయిన్, యంగ్ అచీవర్ అవార్డుల విభాగాలు రెండింటికీ నేను నామినేషన్ దాఖలు చేయవచ్చా?
అవును. నామినేట్ చేసిన వ్యక్తి/సంస్థ వేర్వేరు అయితే ఒకే నామినేషన్ ను రెండు విభాగాలకూ అనుమతిస్తారు. అయితే ఒక వ్యక్తికి/సంస్థకు ఒక విబాగంలో మాత్రమే నామినేషన్ దాఖలు చేయవచ్చు.
ఒక్కో అవార్డు విభాగానికి నేను ఒకటికి మించి నామినేషన్లు దాఖలు చేయవచ్చా?
అవును. ఒక్కో అవార్డు విబాగానికి మీరు ఒకటికి మించి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే, ఒక్కో నామినేషన్ ను విడిగా ఒక్కో నామినేషన్ ఫారంపై సమర్పించాల్సి ఉంటుంది.
ఏదైనా అవార్డు విభాగానికి నన్ను నేను నామినేట్ చేసుకోవచ్చా?
అవును. స్వీయ నామినేషన్, దాంతోపాటు థర్డ్ పార్టీ వ్యక్తి/సంస్థల నామినేషన్లను కూడా అనుమతిస్తారు.
నా నామినేషన్ కు నేను సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించవచ్చా?
అవును. నామినేషన్ తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. అవి ఈ దిగువ పేర్కొన్న విదంగా ఉండవచ్చు:
- మీ సృజనాత్మకత తాలూకు ప్రభావానికి సంబంధించిన డాక్యుమెంటరీ సాక్ష్యం
- ఏవైనా ప్రఖ్యాత సంస్థలకు పరిశోధన పత్రాలు సమర్పించినా, ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నా సంబంధిత కాపీలు
- గుర్తింపులు, అవార్డులు (ఏమైనా వచ్చి ఉంటే)
- తత్సంబంధమైన ఏ ఇతర డాక్యుమెంట్లయినా
ఈ అవార్డులకు ప్రవేశ రుసుమేమైనా ఉందా?
లేదు.
నామినేషన్ ఫారాల సమర్పణలకు చివరి తేదీ ఏమిటి?
నామినేషన్ ఫారాల సమర్పణలకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 30th సాయంత్రం 6.00 గంటలు.
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.