హోమ్ » ఎస్ఈఏ గురించి
మీడియా చరిత్రలోనే తొలిసారిగా అందజేస్తున్న వార్షిక అవార్డులు

సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయత్నమిది. నేటి యువతకు రోల్ మోడల్స్ ను అందజేయడం ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం. తద్వారా యువతకు స్ఫూర్తిదాయకమైన ప్రమాణాలను నిర్దేశించడం, భవిష్యత్తులో వారు గొప్ప విజయాలు సాధించేందుకు చక్కని ఉత్ప్రేరకంగా నిలవడం దీని ఉద్దేశం.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పలు రంగాల ప్రముఖులే గాక స్వచ్ఛంద సేవ, విద్య, క్రీడలు, ఆరోగ్య రంగాల్లో సేవలందిస్తూ తమదైన ప్రభావం చూపుతున్న వ్యక్తులు, సంస్థలకు ఇది ఒక గుర్తింపు, అభినందన.

చక్కని శక్తియుక్తులకు, తెలివితేటలకు, దార్శనికతకు, స్ఫూర్తిదాయకతకు ప్రతీకలుగా నిలిచే వ్యక్తుల, సంస్థల కృషిని... తద్వారా సమాజానికి వారందించే గొప్ప స్ఫూర్తిని చక్కగా సత్కరించుకునే లక్ష్యంతో పూర్తి పారదర్శక పద్ధతిలో E & Y ద్వారా విభాగాలవారీగా అవార్డుల వర్గీకరణ, ప్రముఖులతో కూడిన జ్యూరీ తదితర విధానాల నిర్వహణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ముందెన్నడూ ఇంత భారీ స్థాయిలో ప్రాంతీయ అవార్డులను ఏర్పాటు చేయలేదు.
సాక్షి దినపత్రిక
2008 లో ప్రారంభించబడింది
ప్రపంచ ప్రఖ్యాత Mario Garcia డిజైన్ చేసిన మొట్టమొదటి ప్రాంతీయ వార్తా పత్రిక.
13 లక్షల ప్రారంభ సర్క్యులేషన్.
ABC ప్రకారం 10,64,661 జూలై 19 నుండి డిసెంబర్ 19 వరకు సర్క్యులేషన్.
భారతదేశంలోని టాప్ 10 ప్రాంతీయ వార్తా పత్రికల్లో ఒకటి.
సర్క్యులేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండో అతి పెద్ద వార్తాపత్రిక.
రికార్డు స్థాయిలో ఏకకాలంలో 23 ఎడిషన్ల నుంచి నుంచి ప్రచురితమవుతోంది. ఇంకా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఎడిషన్లు వీటికి అదనం!.
దినపత్రిక తాలూకు అన్ని ఎడిషన్లూ ఆన్ లైన్ లో అందుబాటులో.
సాక్షి టెలివిజన్
2009 లో ప్రారంభించబడింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ప్రాంతాల్లో అత్యధికులు వీక్షించే వార్తా చానల్.
అత్యంత హెచ్చు నాణ్యతతో కూడిన ప్రసార వ్యవస్థ ఉన్న ఏకైక ప్రాంతీయ వార్తా చానల్.
రెండు రాష్ర్టాల్లోనూ అత్యధికంగా వీక్షించే వార్తా చానళ్లలో ఒకటి.
వార్తా చానల్ తాలూకు ఉచిత ఆన్ లైన్ స్ట్రీమింగ్ అందుబాటులో.
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.